అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాహాటంగా నావల లంగరు పోటీలు.. కనిపించని పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖల అధికారులు

Ambedkar Konaseema District Open Boat Anchor Competition
x

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాహాటంగా నావల లంగరు పోటీలు.. కనిపించని పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖల అధికారులు

Highlights

Ambedkar Konaseema: పోటీలు నిర్వహించారని తెలుపుతున్న గ్రామస్తులు

Ambedkar Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామ గోదావరి నదిలో బాహాటంగా నావల లంగరు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎక్కడా పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖల అధికారులు కనిపించలేదు. గ్రామ కట్టడి ప్రకారం గత పది సంవత్సరాలుగా జరుగుతున్న పోటీలకు విరుద్ధంగా రూల్స్ వ్యతిరేకించి మరొక వర్గం పోటీలు నిర్వహించారని తెలిస్తోంది. పోటీల్లో మొదటి స్థానంలో గెలిచిన వారు సంవత్సరం పాటు లంగరు వేసిన ప్రాంతంలో వేటను సాగించే పద్ధతి అక్కడ ఉంది.

కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి గ్రామ పెద్దలకు వ్యతిరేకంగా పోటీలు నిర్వహించారని గ్రామస్తులు తెలిపారు. సుమారు 40 నావలు పైబడి ఈ పోటీలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామాల్లో అనధికారికంగా జరిగే పోటీలు వల్ల వర్గ పోరుకు దారి తీసే ప్రమాదం ఉందని పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories