Ambati Rambabu: రాజమండ్రి జైలునుంచి మాజీమంత్రి అంబటి విడుదల


Ambati Rambabu: సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అరెస్టయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
Ambati Rambabu: సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అరెస్టయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో, జైలు అధికారులు విడుదల ప్రక్రియను పూర్తి చేశారు.
అంబటి విడుదలవుతున్నారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. పార్టీ శ్రేణుల నినాదాలతో జైలు పరిసర ప్రాంతాలు మారుమోగాయి.
జైలు నుంచి విడుదలైన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపారని ఆరోపించారు. "నన్ను బయటకు రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. కానీ న్యాయమే గెలిచింది. ప్రజాక్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారనే ఆరోపణలపై అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, నేడు కోర్టులో ఊరట లభించడంతో విడుదలయ్యారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



