ఆ విషయం నేనే మరిచిపోయా.. గుర్తుచేసినందుకు నాగబాబుకు థ్యాంక్స్

ఆ విషయం నేనే మరిచిపోయా.. గుర్తుచేసినందుకు నాగబాబుకు థ్యాంక్స్
x
Ambati Rambabu Counter To Naga babu
Highlights

జనసేన నేత సినీ నటుడు, నాగబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ట్విటర్ వేదికగా నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. తోకలేని పిట్ట అన్న...

జనసేన నేత సినీ నటుడు, నాగబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ట్విటర్ వేదికగా నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. తోకలేని పిట్ట అన్న సంగతి మరిచిపోయానని, నటనలో ఓటమిపాలై నిష్ర్కమించాను, గుర్తుచేసినందుకు ధన్యవాదాలని అంబటి ట్వీట్ చేశారు. రాజకీయల్లో ఓటమి పాలైనా బహు పాత్రలలో బాగు బాగు అంటూ.. పవన్ కల్యాణ్ మోదీ, చంద్రబాబు, వామపక్షాలతో ఉన్న ఫోటోను ట్విట్ చేశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం చేశారు. బాగా నటిస్తున్నారు. మీసోదరుడు జనసేన పార్టీని మోయలేక బీజేపీలో ముంచబోతున్నారని, సినిమాల్లో నటించబోతున్నారు..' అని అంబటి ఎద్దేవా చేశారు. అన్నదమ్ములు సినీమాల్లో నటించిం వినోదం ఇవ్వచ్చు కానీ రాజకీయాల్లో నెగ్గలేరని అంబటి ట్వీట్ చేశారు.

వైసీపీ నేతలపై జనసేన నేత సినీనటుడు నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజీపీ- జనసేన పార్టీల మధ్య పొత్తు వైసీపీ నేతలు చూడలేకపోతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో వేదికగా వైసీపీ ఎమ్మెల్యే అబంటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి నుంచి నాగబాబు సోషల్ మీడియాలో రాజధాని రైతలు అంశాలపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌటర్ ఇస్తువస్తున్నారు.

అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి పలు విమర్శలు చేశారు. బీజేపీ పాచిపోయిన లడ్డులు ఇచ్చిందన్న పవన్.. ఇప్పుడు ఏ లడ్డులు ఇచ్చిదని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం లేదని అంబటి విమర్శించారు. అంబటి వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో స్పందించిన నాగబాబు "వైసీపీ పార్టీ మరియు అంబటి గారి దు:ఖాన్ని చూడలేకపోతున్నారు " అని పోస్టు చేశారు. ఆతర్వాత అంటి నటిచింన తోకలేని పిట్ట చిత్రలో ఫోటో పెట్టి ఏకపాత్రాభినయంలో అంబటి గొప్ప నటుడని పోస్ట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories