ఇవాళ మధ్యాహ్నం వైసీపీ నేతల అత్యవసర భేటీ..

ఇవాళ మధ్యాహ్నం వైసీపీ నేతల అత్యవసర భేటీ..
x
Highlights

ఏపీకి మూడు రాజధానులు, అమరావతిలో రైతుల ఆందోళనల నేపథ్యంలో అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. గురువారం మధ్యాహ్నం 3.30...

ఏపీకి మూడు రాజధానులు, అమరావతిలో రైతుల ఆందోళనల నేపథ్యంలో అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వీరు సమావేశం అవుతారు. ఈ సమావేశానికి వైసీపీ అగ్రనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ అలాగే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి హాజరు కానున్నారు. ప్రధానంగా మూడు రాజధానుల ప్రతిపాదనలు.. రాజధాని రైతుల ఆందోళనపై చర్చించనున్నట్లు సమాచారం.

కాగా రేపు సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. క్యాబినెట్ భేటీలో రాజధాని విషయంపై కీలక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఒక రోజే ముందే ఈ సమావేశం జరగడం ప్రాధ్యాన్యతను సంతరించుకుంది. మరోవైపు రేపు క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో సీఎం నివాసం, సచివాలయం, అసెంబ్లీ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు పోలీసులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories