AP Weather Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్

Amravati Meteorological Department has Issued Rain Alert to AP
x

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* ఏపీకి రెయిన్ అలర్ట్ ప్రకటించిన అమరావతి వాతావరణ కేంద్రం * ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

AP Weather Alert: ఏపీకి రెయిన్ అలర్ట్ ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్రం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ఇవాళ ఉదయం వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది.

వీటి ప్రభావంతో ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories