ఏపీ సీఆర్డీఏ, రెరాకు అమరావతి రైతుల నోటీసులు

Amaravati Farmers Notices To AP
x

ఏపీ సీఆర్డీఏ, రెరాకు అమరావతి రైతుల నోటీసులు

Highlights

Amaravati: రైతులు పొందిన ప్లాట్లను ఈ నెల 31 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటీసులు

Amaravati: అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు ప్రభుత్వానికి అప్పగించారు. భూములను ఇచ్చిన సమయంలో ఏపీ సీఆర్డీఏతో రైతులు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం భూములను అభివృద్ధి చేసి ప్లాట్ లు, కమర్షియల్ స్థలాలు రైతులకు తిరిగి అప్పగించే విధంగా నాడు ఒప్పందం జరిగింది. భూసమీకరణ ఒప్పందం ప్రకారం రైతులకు ప్లాట్లను మూడేళ్లలోగా అభివృద్ది చేయాలన్న నిబంధన ఉంది. అయితే ఇప్పటి వరకూ రైతులకు ప్లాట్ లను అభివృద్ధి చేసి ఇవ్వలేదు.

అభివృద్ధి చేయకపోవడంతో తాము జీవనోపాధి కోల్పోయామని CRDA, ఏపీ రేరాకు రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు. భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రైతుల ప్లాట్లను.. మూడేళ్లలోగా అభివృద్ధి చేయాలని నిబంధన ఉంది. అభివృద్ధి చేయకపోవడంతో జీవనోపాధి కోల్పోయామని రైతులు పేర్కొంటూ ఎకరానికి 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని నోటీస్‌లో పేర్కొన్నారు. రైతుల తరపున CRDA, ఏపీ రేరాకు హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్‌ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. సీఆర్డీఏ ప్రాజెక్ట్‌ను ఎందుకు తీసుకోలేదని ఏపీ రేరాకు లీగల్‌ నోటీసులు ఇచ్చారు. రైతుల నివాస స్థలాలకు గజానికి నెలకు 50 రూపాయలు, వాణిజ్య స్థలాలకు గజానికి 75 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఈ నెలాఖరులోగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదించి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేఖలు రాసిన తరుణంలోనే న్యాయవాది ద్వారా సీఆర్డీఏ, రెరాకు నోటీలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై సీఆర్డీఏ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories