AP Capital: ప్రారంభమైన అమరావతి రాజధాని నిర్మాణ పనులు

Amaravati Capital Construction Work Started in Andhra Pradesh
x

ప్రారంభమైన అమరావతి రాజధాని నిర్మాణ పనులు

Highlights

AP Capital: హైకోర్టు ఆదేశాల తర్వాత పనులను ప్రారంభించిన CRDA

AP Capital: ఏపీ హైకోర్టు ఆదేశాల తర్వాత అమరావతిలో CRDA రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయాయి. హైకోర్టు ఆదేశాలు, కోర్టు ధిక్కార కేసులతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మళ్లీ ఇప్పుడు పనులు షురు అవ్వడంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో 70-80 శాతం పూర్తయిన భవనాలను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది CRDA.

అమరావతి పరిధిలోని రాయపూడిలో తుది దశలో ఉన్న భవన నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థను CRDA ఆదేశించింది. దీంతో నిర్మాణ సంస్థ NCC సిబ్బంది పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ ల నిర్మించిన క్వార్టర్స్‌లో ఒక్కో దానిలో 6 చొప్పున అపార్ట్‌మెంట్లలో పనులను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న భూములు చకచక జరిగిపోతున్నాయి.

CRDA రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టడం సంతోషకరమని, ఇలాగే సీడ్‌యాక్సెస్‌ రోడ్డు, పర్మినెంట్‌ టవర్స్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని రాజధాని గ్రామాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. తాము ఇచ్చిన భూముల్లో ప్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వాలని త్వరితగతిన నిర్మాణాలను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.

రాజధాని అమరావతిపై రైతుల కేసులకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులతో వైసీపీ సర్కారు దిగిరాక తప్పలేదు. దీంతో త్వరగా పూర్తయ్యే భవనాలను ఎంచుకుని పనులు మొదలు పెట్టింది ప్రభుత్వం. మరి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను పూర్తి చేస్తుందా.. ఏదో వంక పెట్టి నిలిపివేస్తుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories