విశాఖ క్షత్రియ కళ్యాణ మండపంలో ఘనంగా అల్లూరి వర్థంతి కార్యక్రమం

Alluri Sitarama Raju Vardhanthi At Visakhapatnam | AP News Today
x

విశాఖ క్షత్రియ కళ్యాణ మండపంలో ఘనంగా అల్లూరి వర్థంతి కార్యక్రమం

Highlights

*హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి రోజా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు

Visakhapatnam: రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. గిరిజనుల మీద బ్రిటీష్ వారు చేస్తున్న దౌర్జన్యన్ని ధైర్యంగా ఎదురించారని అల్లూరిని స్మరించుకోవడం మన అదృష్ట మన్నారు. విశాఖ క్షత్రియ కళ్యాణ మండపంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రి రోజా..అల్లూరి సీతారామరాజు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అన్నారు. ఆయన చనిపోలేదని మన అందరి మనస్సుల్లో బ్రతికే ఉన్నాడని మంత్రి రోజా తెలిపారు. అల్లూరి వర్ధంతి కార్యక్రమంలో అమరనాథ్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories