శ్రీశైలం దేవస్థాన పరిధిలో దుకాణాలు లక్కీడిప్‌తో కేటాయింపు

* 140 దుకాణాల్లో 101 దుకాణాల కేటాయింపు... రేపటినుంచి దుకాణాలను అప్పగించనున్న అధికారులు

R Tripura Malini
Published on: 4 Dec 2022 11:15 AM IST
Allotment Of Shops In Srisailam Devasthanam With Luckydip
X

శ్రీశైలం దేవస్థాన పరిధిలో దుకాణాలు లక్కీడిప్‌తో కేటాయింపు

Srisailam: శ్రీశైలం దేవస్థానం పరిధిలో దుకాణాల సముదాయాన్ని లక్కీడిప్‌ద్వారా కేటాయించారు. నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న దుకాణాల కేటాయింపుపై హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. శ్రీశైలం దేవస్థానానికి సంబందించిన లలితాంబ కమర్షియల్ కాంప్లెక్స్‌లో దుకాణాలను వ్యాపారస్తులకు లక్కీడిప్ నిర్వహించి కేటాయించారు. 140 దుకాణాలకు గాను 101 మంది ముందుకొచ్చారు. దుకాణాల నంబర్లవారీగా డిప్ తీసి వ్యాపారస్తులకు కేటాయించారు. లక్కీడిప్‌లో పాల్గొన్న దుకాణదారులకు రేపటినుంచి నిర్వహించుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. షాపుల కేటాయింపు కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థాన పాలకమండలి ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థాన ఈవో లవన్న, పాల్గొన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story