టీడీపీ కార్యాలయం కూల్చేయాలంటూ ఆళ్ల పిటిషన్‌

టీడీపీ కార్యాలయం కూల్చేయాలంటూ ఆళ్ల పిటిషన్‌
x
Highlights

మంగళగిరిలోని ఆత్మకుర్ వద్ద నిర్మించిన నూతన టిడిపి కార్యాలయాన్ని కూల్చివేయాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

మంగళగిరిలోని ఆత్మకుర్ వద్ద నిర్మించిన నూతన టిడిపి కార్యాలయాన్ని కూల్చివేయాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. గత ప్రభుత్వం సర్వే నెంబర్ 392 లోని 3.65 ఎకరాలను 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చిందని, ఇది చట్టవిరుద్ధమని ఎమ్మెల్యే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, సిసిఎల్‌ఎ కార్యదర్శి, ఏపీ సిఆర్‌డిఎ కమిషనర్, జిల్లా కలెక్టర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను ప్రతివాదులుగాఈ పిటిషన్ లో చేర్చారు.

ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రానుంది. చెరువులు, నదీ పరీవాహక ప్రాంతాల వద్ద భూములు కేటాయించడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆళ్ల తన పిటిషన్ ద్వారా గుర్తుచేశారు, ఇది చట్టానికి విరుద్ధంమని పేర్కొంటూ.. గత ప్రభుత్వం ఇచ్చిన జిఓను పూర్తిగా రద్దు చేసి, అక్రమ టిడిపి భవనాన్ని కూల్చివేయాలని సిఆర్‌డిఎ కమిషనర్‌ను ఆదేశించాలని ఆర్కే తరుపు న్యాయవాదులు కోర్టును కోరారు. కాగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు లోకేష్ దంపతులు పూజలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories