సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారికి రూ.100 ఫైన్.. కరోనాపై జాగ్రత్తలు

సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారికి రూ.100 ఫైన్.. కరోనాపై జాగ్రత్తలు
x
Highlights

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే వాటిని విడుదల చేయాలని సీఎం జగన్ పోలీసులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ పరిస్థితులపై అధికారులతో శనివారం జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా మళ్లీ నియమాలను ఉల్లఘించబోమంటూ వాహనదారుల నుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని సీఎం సూచించారు. రూ.100ల జరిమానాకు పరిమితం చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టంచేశారు. వాహనాలు వారికి అప్పగించేటప్పుడు కరోనా నివారణ కోవిడ్‌ జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించాలని పోలీసులు అధికారులకు సీఎం సూచించారు.

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories