కాంగ్రెస్‌లో భారీగా నియామకాలు... మాజీ సీఎంకు కీలక పదవి

కాంగ్రెస్‌లో భారీగా నియామకాలు... మాజీ సీఎంకు కీలక పదవి
x
Highlights

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆఫీస్‌ బేరర్స్‌, డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది.

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆఫీస్‌ బేరర్స్‌, డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. ఈ కమిటీల్లో 11మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులకు అవకాశం కల్పిచింది. 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 29 మందితో కో-ఆర్డినేషన్ కమిటీని ఖరారు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీలలో స్థానం కల్పించారు. ఏఐసీసీ ఇంకో 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ రాజకీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ సమన్వయ కమిటీకి చైర్మన్‌గా కొనసాగుతారు. పీపీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రిరఘువీరారెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం కల్పించింది. మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌ చైర్మన్‌లు ఎక్స్‌అఫిషియో,యూత్‌ కాంగ్రెస్‌, ఎన్ఎస్‌యూఐ, సభ్యులుగా వ్యవహరించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories