జగన్ ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు ఆ బ్యాంకు రెడీ

జగన్ ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు ఆ బ్యాంకు రెడీ
x
ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు అధికారులతో జగన్
Highlights

ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేసేందుకు ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మూడు బిలియన్‌ డాలర్ల ఆర్థిక...

ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేసేందుకు ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మూడు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏఐఐబీ తెలిపింది. గతంలో ఇచ్చిన రుణానికి అదనమని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ పాలసీలతో తమకు సంబంధం లేదని, నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ఏఐఐబీ ప్రతినిధులు సచివాలయంలోని కార్యాలయంలో సమావేశమయ్యారు.

రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఆదేరంగంపై ఆధారపడి ఉన్నారని, అలాగే ఎక్కువమందికి ఉపాథి కల్పించేది వ్యవసాయరంగమేనని సీఎం స్పష్టంచేశారు. అందుకే ఇరిగేషన్‌ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి డబ్బు మంజూరు చేస్తామని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలను కూడా బ్యాంకు ప్రతినిధులకు సీఎం వివరించారు. ఇంగ్లిషు మీడియం విద్యను స్కూళ్లలో ప్రవేశపెట్టడంతోపాటు.. కనీస సదుపాయాలు, మధ్యాహ్న భోజనంలో మార్పులను వివరించారు. నిరక్షరాస్యత నిర్మూలించడానికి పిల్లలను బడులకు పంపేలా అమ్మ ఒడి కింద తల్లులను ప్రోత్సహించడానికి నేరుగా నగదు బదిలీచేసిన అంశాన్ని వారికి వివరించారు.

కొత్తగా నిర్మించనున్న పోర్టులపై సీఎంను ఆరా తీయగా.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో పోర్టులను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. ఒక పోర్టుకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. వాటర్‌ గ్రిడ్, ఇరిగేషన్, రోడ్లు, ఎయిర్‌ పోర్టుల నిర్మాణాలకు సహాయం ఉంటుందని ఏఐఐబీ బ్యాంకు అధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories