భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన హాంకాంగ్‌ సంస్థ

భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన హాంకాంగ్‌ సంస్థ
x
Highlights

భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన హాంకాంగ్‌ సంస్థ భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన హాంకాంగ్‌ సంస్థ

హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లాలో భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడితో పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సంస్థ సీఎఫ్‌వో టిమ్‌కుతు, డైరెక్టర్లు మిన్‌ హిసు తస్సాయి, హాసాయోయన్‌లీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు.

దాదాపు గంటపాటు జరిగిన ఈ చర్చలో పెట్టుబడులు పెట్టేందుకు హాంకాంగ్‌ ప్రతినిధులు సిద్ధం అయ్యారు. దీంతో ఇందుకు అవసరమైన 298 ఎకరాలను ఏపీఐఐసీ ఎకరం రూ.6.5 లక్షల చొప్పున ఈ యూనిట్ కు కేటాయించనుంది. కాగా ఈ సంస్థ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే నెల్లూరు జిల్లా మాంబట్టులో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇక ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఫ్రధాన కార్యదర్శి రజిత్‌ భార్గవ తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories