Top
logo

Gas Leak: తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ ఓఎన్జీసీ గ్యాస్ లీక్

Again ONGC Gas Leak in East Godavari District
X

ONGC (file Image)

Highlights

Gas Leak: ఓఎన్జీసీ పైప్ లైన్లకు పలుచోట్ల రంధ్రాలు * ఆరేడు ప్రాంతాల్లో పైకి ఎగిసిపడుతోన్న గ్యాస్‌

Gas Leak: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ పైప్‌లైన్స్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. పైప్ లైన్లకు పలుచోట్ల రంధ్రాలు పడటంతో ఆరేడు ప్రాంతాల్లో గ్యాస్‌ పైకి ఎగిసిపడుతోంది. దాంతో, కేశవదాసుపాలెం వాసులతోపాటు సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 30ఏళ్ల నాటి గ్యాస్ పైప్‌ లైన్లకు తుప్ప పట్టడంతో పదేపదే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొత్త పైప్‌లైన్లు వేయాలని ఎన్నిసార్లు మొర్రపెట్టుకున్నా ఓఎన్జీసీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాత పైప్‌ లైన్లను తొలగించి. సముద్ర తీరం వెంబటి కొత్త వాటిని వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Web TitleGas Leak: Again ONGC Gas Leak in East Godavari District
Next Story