మంత్రి పెద్దిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Again Minister Peddareddy Sensational Comments
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

* నిమ్మగడ్డ ఆదేశాలు పాటించే వారిపై భవిష్యత్‌లో చర్యలు తప్పవు- మంత్రి పెద్దిరెడ్డి * నిమ్మగడ్డ వ్యవహార శైలిని ముందే ఊహించాం- మంత్రి పెద్దిరెడ్డి

పంచాయతీ ఎన్నికల వేళ రోజు రోజుకు ఏపీ ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య వార్‌ ముదురుతోంది. ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసిన కాసేపటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ ఆదేశాలు పాటించే వారిపై భవిష్యత్‌లో చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను నిమ్మగడ్డ ఆదేశాలు లెక్కచేయనని తేల్చిచెప్పారు. నిమ్మగడ్డ కేవలం అధికారి మాత్రమే తాను రాష్ట్రమంత్రినని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిని ఇంట్లో నిర్బంధించాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ వ్యవహార శైలిని ముందే ఊహించామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories