రాష్ట్ర హోంమంత్రి చే ఆదిత్య టెక్నికల్ హబ్ నూతన యాప్ ఆవిష్కరణ

రాష్ట్ర హోంమంత్రి చే ఆదిత్య టెక్నికల్ హబ్ నూతన యాప్ ఆవిష్కరణ
x
హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి టి.వనిత, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, డి.జి.పి.గౌతమ్ సవాంగ్
Highlights

మండలంలోని సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ నందు గల ఆదిత్య టెక్నికల్ హబ్ బృందం చే నూతనయాప్ ఆవిష్కరించడం జరిగింది.

గండేపల్లి: మండలంలోని సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ నందు గల ఆదిత్య టెక్నికల్ హబ్ బృందం చే నూతనయాప్ ఆవిష్కరించడం జరిగిందని ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ రూపొందించబడిన నూతన యాప్ రాష్ట్ర పోలీస్ విభాగంలో సేవలందించడానికి సిద్ధం చేయ డం జరిగింది దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితచే ప్రారంభించడం జరిగిందని సతీష్ రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రి టి.వనిత, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, డి.జి.పి.గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీసుకమీషనర్ ద్వారకా తిరుమలరావు, ఆదిత్య టెక్నికల్ హబ్ సి.ఈ.ఓ.బాబ్జీ నీలం,చైతన్య ఈమని తదితరులు పాల్గొన్నారన్నారు.

ఆదిత్య టెక్నికల్ హబ్ ఆధ్వర్యంలో పోలీస్ వారు గర్వించే విధంగా ఎన్నడూ లేని విధంగా భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రజలకు అవగాహన కల్పిం చడానికి ఉపయోగ పడే విధంగా అగ్మెంటేడ్ రియాలిటీ అప్లికేషన్ ను తమ టెక్నికల్ హబ్ బృందం రూపొందించడం జరిగిందని టెక్నికల్ హబ్ సి.ఈ. ఓ. బాబ్జి నీలం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఅప్లికేషన్ ప్రజలకు అందుబాటులోకి ఉంచే విధంగాసిద్ధం చేయడం జరిగింద ని,ఈయాప్ ద్వారా ఒక చిత్రాన్ని స్కాన్ చేయడం వల్ల ఆచిత్రంలో ఉన్న సమాచారాన్ని బట్టి మరింత సమాచారం వీడియో రూపంలో పూర్తిగా అందిస్తుందన్నా రు. ఈ అప్లి కేషన్ రూపొందించిన టెక్నికల్ హబ్ డెవలపర్స్ ప్రశాంత్ కేదారశెట్టి, కిరణ్ ఇమ్మంది లను ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, టెక్నికల్ హబ్ సి.ఈ.ఓ బాబ్జి తదితరులు అభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories