టాప్100 వర్ధమాన రచయితల జాబితాలో ఆదిత్య విద్యార్థి కి స్థానం

టాప్100 వర్ధమాన రచయితల జాబితాలో  ఆదిత్య విద్యార్థి కి స్థానం
x
రచయిత సాయి ప్రదీప్, చైర్మన్ డా.నల్లమిల్లిశేషారెడ్డి, నల్లమిల్లి సతీష్ రెడ్డి, డా. వి.శ్రీనివాసరావు
Highlights

గండేపల్లిమండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుచున్న సాయి ప్రదీప్ 2018-19 సంవత్సరం టాప్ 100 వర్ధమానరచయితల జాబితాలో స్థానం

గండేపల్లి: గండేపల్లిమండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆఖరుసంవత్సరం చదువుచున్న బొడ్డు సాయి ప్రదీప్ 2018-19 సంవత్సరం టాప్ 100 వర్ధమాన రచయితల జాబితాలో స్థానం పొందినట్లు ప్రిన్సిపాల్ డా.మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

"ఆల్ ది లైట్స్ వితిన్ అజ్" ఇంగ్లీష్ బుక్ (కవితలు) స్వీయ రచనకు గాను మంచి గుర్తింపు పొందిన ప్రదీప్, ఇతర రచయితల కలయికతో "మాన్సూన్డైరీస్","ఎపిస్టల్స్","ది స్క్రిబ్లర్స్ డైరీ" వంటి కవితాసంకలనాలతో కవిత మార్గంలో ప్రవేశించారు. స్వగ్రామం తుని వద్ద గల కోటనందూరు. తండ్రిబొడ్డు నరసింహ మూర్తి ప్రయివేట్ ఉపాధ్యాయులు, తల్లి సోమనమ్మ గృహిణి, పదవ తరగతి వరకు పాయకరావు పేట శ్రీ ప్రకాష్ లో చదివిన ప్రదీప్ ఇంటర్ మీడియట్నారాయణ వైజాగ్ లో పూర్తి చేసారు.

8,9వ తరగతి నుండే కవితల పట్ల రచనల పట్ల ఆసక్తి పెంచుకొన్నానని, తెలుగులో శ్రీశ్రీ, చలం ఇష్టమైన రచయితలని, అగతక్రిస్టీ, వాల్ట్ విట్మాన్ రచనలన్నా తనకెంతోఇష్టమని, పుస్తక పఠనం తనకు ఎంతో ఇష్టమైన హాబీ అనిఇప్పటి వరకు 700కు పైగా పుస్తకాలు చదివానని, క్రికెట్ ఆడతానని, బెంగుళూర్ కు చెందిన "హీలోఫై"లోఉద్యోగం పొందిన ప్రదీప్ రచయిత గా కొనసాగాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు.

రచయితసాయిప్రదీప్ ను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డా.నల్లమిల్లిశేషారెడ్డి, వైస్చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, వైస్ప్రిన్సిపాల్స్ డా. వి.శ్రీనివాసరావు, డా. ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ డా.రాయుడు శ్రీనివాసరావు,ఇ.సి.ఈ. విభాగాధిపతి సత్యనారాయణ, తదితరులుఅభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories