Nakkapalle: హెటిరో డ్రగ్స్ ని సందర్శించిన అడిషనల్ డీజీపీ

Nakkapalle: హెటిరో డ్రగ్స్ ని సందర్శించిన అడిషనల్ డీజీపీ
x
Highlights

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలిస్ శాఖ నడుంబిగించింది. అడిషినల్ డీజీపీ సునీల్ కుమార్ విశాఖ జిల్లా నక్కపల్లి హెటెరో డ్రగ్స్, డెక్కన్ కెమికల్స్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించి..

నక్కపల్లి: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలిస్ శాఖ నడుంబిగించింది. అడిషినల్ డీజీపీ సునీల్ కుమార్ విశాఖ జిల్లా నక్కపల్లి హెటెరో డ్రగ్స్, డెక్కన్ కెమికల్స్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించి... కరోనా వైరస్ పై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. ప్రస్తుతం 30 శాతం సిబ్బంది హెటెరో డ్రగ్స్ లో విధులు నిర్వహిస్తున్నారని, చుట్టుపక్కల ప్రాంతాల నుండి విధులకు హాజరవుతున్న సిబ్బందికి వాహనాల సదుపాయం ఏర్పాటు చేశామని కంపెనీ ప్రతినిధులు కమలాకర్ రెడ్డి, కుళాయి రెడ్డి, ఆర్ కే రెడ్డి సునీల్ కుమార్ కి తెలిపారు. అదే విధంగా ప్రతీ గ్రామంలో పారిశుద్యం నిర్వహణకు అవసరమైన హైపో సోడియం, బ్లీచింగ్ వంటి వాటిని తహసీల్డార్లకు అందజేస్తున్నట్లు హెటిరో ప్రతినిధులు పేర్కొన్నారు. పారిశుధ్యాన్ని పక్కాగా నిర్వహిస్తున్నామని, తమ కంపెనీ ఉద్యోగులు తమకు చాలా ముఖ్యమని, వారికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.


ప్రభుత్వ నిబంధనలు అన్నీ పాటించేలా ఉద్యోగులందరికీ అవగాహన కల్పించామని డక్కన్ కెమికల్స్ ప్రతినిధి వీరారెడ్డి తెలియజేశారు. తమ కంపెనీ పరిసర గ్రామాలలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశామని వీరారెడ్డి చెప్పారు. విధులు నిర్వహిస్తున్నవారికి తీసుకున్న ప్రత్యేక శ్రధ్ధలపై అడిషనల్ డీజీపీ ఆరా తీశారు. వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించాలని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించి, హోమ్ క్వారంటెన్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అడిషినల్ డీజీపీ సునీల్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, వీసం రామకృష్ణ, సీఐ విజయకుమార్, ఎస్ఐ రామకృష్ణ, డెక్కన్ ప్రతినిధులు లక్ష్మీపతిరాజు, సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories