రామసుబ్బారెడ్డి అందుకు సుముకంగా లేరా..?

రామసుబ్బారెడ్డి అందుకు సుముకంగా లేరా..?
x
Highlights

జమ్మలమడుగు పంచాయతీ మరోసారి అమరావతికి చేరింది. జమ్మలమడుగు టికెట్ నాకంటే నాకని మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి' పోటీ పడుతున్నారు....

జమ్మలమడుగు పంచాయతీ మరోసారి అమరావతికి చేరింది. జమ్మలమడుగు టికెట్ నాకంటే నాకని మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి' పోటీ పడుతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు జమ్మలమడుగు పంచాయితీ తీర్చడానికి సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. అయిన సమస్య సద్దుమణగలేదు. గతంలో ఇద్దరిలో ఒకరిని పార్లమెంట్ కు, మరొకరిని అసెంబ్లీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు దేనికి పోటీ చేస్తారో చర్చించుకుని రావాలని చెప్పడంతో ఇరువురు నేతలు మరోసారి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

పట్టుదలకు ఇరువురు నేతలు పోకుండా జమ్మలమడుగు అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. అలాగే టికెట్ సంగతి తేల్చాలని వారిద్దరూ చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కువశాతం మంత్రి ఆదికే టికెట్ దక్కే సూచనలు ఉన్నట్టు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కడప ఎంపీగా పోటీ చేయడానికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సుముఖంగా లేరని కూడా ప్రచారం నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories