రైతు భరోసా పథకం జాబితాలో ఏపీ మంత్రి పేరు

రైతు భరోసా పథకం జాబితాలో ఏపీ మంత్రి పేరు
x
Highlights

రైతు భరోసా పథకం జాబితాలో ఏపీ మంత్రి పేరు రైతు భరోసా పథకం జాబితాలో ఏపీ మంత్రి పేరు

రైతు భరోసా పథకం జాబితాలో సాక్షాత్తూ ఏపీ మంత్రి ఆదిమాలపు సురేష్ పేరు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆ పేరును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. పేద రైతులు, 5 ఎకరాలు మించకూడని రైతులు, ఆదాయపన్ను చెల్లించేవారు ఈ పధకానికి అనర్హులు.అయితే అధికారుల తప్పిదం వలన సాక్షాత్తూ ఏపీ మంత్రినే అర్హుల జాబితాలో చేర్చారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు లబ్ధిదారుల ఉండిపోయింది.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో ఖాతా నెంబర్ 1881లో మంత్రిని అర్హుడిగా చేర్చినట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఆ పేరును తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు ఆదిమూలపు సురేష్. అంతేకాదు... చాలాకాలంగా ఆయన ఇన్ కం ట్యాక్స్ కూడా కడుతున్నారు. కానీ ఆయన పేరును కూడా రైతు భరోసా జాబితాలో చేర్చడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories