నెల్లూరు నగరంలో అయిదు ఫ్లై ఓవర్లు నిర్మాణానికి కృషి: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు నగరంలో అయిదు ఫ్లై ఓవర్లు నిర్మాణానికి కృషి: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
x
ఆదాల ప్రభాకర్ రెడ్డి
Highlights

నగరంలో వివిధ ప్రాంతాల్లో 5 ఫ్లైఓవర్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నానని, ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

నెల్లూరు: నగరంలో వివిధ ప్రాంతాల్లో 5 ఫ్లైఓవర్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నానని, ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం, ఫ్లై ఓవర్ల పోరాట సాధన కమిటీ ప్రతినిధులు ఆదాలను కలిసి వినతిపత్రం అందజేశారు. 2004 నుంచి నెల్లూరు నగరంలో ఫ్లైఓవర్లు లేని కారణంగా 200 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 400 మంది వికలాంగులు అయ్యారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ విషయమై రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఒక వినతి పత్రాన్ని ఇచ్చామని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో నేషనల్ హైవేస్ ఛైర్మన్ ను కలిసి మాట్లాడతామని తెలిపారు. వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. దీన్ని మొదటి ప్రాధాన్యంగా భావిస్తామని స్పష్టం చేశారు. వినతిపత్రంఅందచేసిన వారిలో ఆచార్య ఆదిత్య. ఆర్. శ్రీనివాసులు, శిరసాని కోటిరెడ్డి, కట్టా సతీష్, సూర్యనారాయణ, శంకర్, రామకృష్ణలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరసింహారావు, అబూబకర్, డాక్టర్ సునీల్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories