మరోసారి వివాదాల్లోకి తారా చౌదరి.. ఎస్ఐపై సంచలన ఆరోపణలు..

మరోసారి వివాదాల్లోకి తారా చౌదరి.. ఎస్ఐపై సంచలన ఆరోపణలు..
x
Tara chowdary
Highlights

టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు, పొలిటికల్ ఇండస్ట్రీను కుదిపేసిన తారా చౌదరి మళ్లీ తెరపైకి వచ్చారు.

టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు, పొలిటికల్ ఇండస్ట్రీను కుదిపేసిన తారా చౌదరి మళ్లీ తెరపైకి వచ్చారు. 2012లో ప‌లువురు ప్ర‌ముఖుల‌పై లైంగిక ఆరోప‌ణ‌లు గుప్పించి సంచ‌ల‌నం రేకెత్తించి కొన్ని నెల‌ల పాటు వార్త‌ల్లో నిలిచారు తారా చౌదరి. ఆ తర్వాత చాన్నాల్లు కనిపించకుండా వెళ్ళిపోయింది. తాజాగా ప్రకాశం జిల్లా పామూరులో భర్త, కొడుకుతో ఉంటున్న తారా.. స్థానిక ఎస్సైపై సంచలన ఆరోపణలు చేశారు. ఎస్పై అకారణంగా తన భర్తపై దాడి చేశారని, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటన కుమారుడు మందులు, నిత్యావసరాలు కోసం వెళ్లిన సమయంలో జరిగిందని ఆమె చెప్పారు.

నిత్యవసరాల కోసం బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను ఎస్సై దారుణంగా కొట్టారని.. నాటుసారా విక్రయిస్తున్నారని అక్రమ కేసులు పెట్టారని తారా చౌదరి ఆరోపించారు. నాటు సారా రవాణా చేస్తున్నాడని ఎస్సై ఆరోపిస్తూ.. బ్రీత్ ఎన‌లైజ్ టెస్టులు చేశారని దీనిపై ప్రశ్నిస్తే జైల్లో పెడతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఎస్సై ఉద్దేశకపూర్వకంగానే తమను టార్గెట్ చేశారని అన్నారు. తన భర్త ఒంటిపై గాయాలను మీడియాకు చూయించారు. ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తారాచౌదరి అంటున్నారు. 20 రోజుల క్రితం ఎస్సై ట్రాన్స్‌ఫర్ అయ్యారని, అయినా పామూరులో ఎందుకు ఉన్నారని తారా చౌదరి ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజల సమస్యలు ఎస్ఐ దృష్టికి తీసుకెళ్తామని ఆ కోపంతోనే తమను టార్గెట్ చేశారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories