Actress Kavitha: సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలపై ఇలా మాట్లాడటం దారుణం

Actress Kavitha Condemned Bandaru Satyanarayana Comments On Minister Roja
x

Kavitha: సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలపై ఇలా మాట్లాడటం దారుణం

Highlights

Actress Kavitha: బండారు వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలి

Actress Kavitha: మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను సినీ నటి కవిత ఖండించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీలో నాయకులు మహిళలను ఇంత దారుణంగా మాట్లాడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు అసహ్యించుకునేలా నీచమైన భాషను మహిళలపై మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. నటుడు ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీలో ఉన్నవారు సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలపై ఇలా మాట్లాడటం దారుణమన్నారు. బండారు వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలని సినీ నటి కవిత డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories