ఏపీలో యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం.. 1056 మంది డిశ్చార్జ్ : జవహర్‌రెడ్డి

ఏపీలో యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం.. 1056 మంది డిశ్చార్జ్ : జవహర్‌రెడ్డి
x
Jawahar Reddy
Highlights

రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. కోవిడ్ బారి నుంచి 1056 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 51.49 శాతంగా ఉందని తెలిపారు. విజయవాడ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పడుతోందని, ఈ మ‌హమ్మ‌రి బారి నుంచి మరణాల శాతం తగ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తింపుతో పాటుగా హైరిస్క్‌ కేటగిరీ వారిని రక్షించుకోవాలని జ‌వ‌హ‌ర్ రెడ్డి అన్నారు. హైరిస్క్ ఉన్న‌వారి వ్యాధులున్న వృద్ధులు గుర్తించి వారికి పరీక్షలు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. అత్యవసర కేసుల్లో ప్లాస్మా సేకరిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. స్విమ్స్‌, కర్నూలు జీజీహెచ్‌లో ప్లాస్మా సేకరిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించిందన్నారు.

ప్రధాని మోదీ సూచనలు మేరకు లాక్‌డౌన్ నుంచి బయటకు వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు జవహర్‌ రెడ్డి తెలిపారు. వివిధ రంగాలకు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. కమిటీలు సమర్పించిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పారు. రాష్ట్రంలోకి వ‌చ్చే వలస కార్మికులు, ఇత‌రుల‌పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంద‌ని జ‌వ‌హ‌ర్ రెడ్డి చెప్పారు. ఇత‌ర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వ‌చ్చి వారిని క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నామ‌న్నారు.

గుజరాత్‌ నుంచి వచ్చిన మత్స్యకారులకు కరోనా లక్షణాలు లేవని, మహారాష్ట్ర నుంచి వచ్చిన మ‌త్స్య‌కారుల్లో కోవిడ్ లక్షణాలు గుర్తించామ‌ని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికలకు పరీక్షల్లో పాజిటివ్ కేసులు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. కర్నూలు జిల్లా కార్మికుల్లో 37 మందికి పాజిటివ్ వ‌చ్చాయ‌ని, కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన వారిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారు ఎక్కువ‌గా ఉన్నార‌ని వారంద‌రికి పరీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని జ‌వ‌హ‌ర్ రెడ్డి వెల్ల‌డించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories