టీడీపీలోకి కౌశల్.. ఆయనకు సీటు లేదా?

టీడీపీలోకి కౌశల్.. ఆయనకు సీటు లేదా?
x
Highlights

బిగ్‌బాస్‌-2 సీజన్ విజేత కౌశల్‌ మందా నిన్న(శుక్రవారం) ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. కౌశల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు...

బిగ్‌బాస్‌-2 సీజన్ విజేత కౌశల్‌ మందా నిన్న(శుక్రవారం) ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. కౌశల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎంకు పరిచయం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగాలని కౌశల్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీటు రాకుంటే పార్టీ తరుపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి కౌశల్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

కొద్ది రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని కౌశల్‌ సీఎంకు తెలిపారు. కౌశల్ ను పార్టీలోకి ఆహ్వానించిన సీఎం పార్టీకోసం పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. మరోవేపు కౌశల్ అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సీటుపై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ కౌశల్ కు టికెట్ ఖరారు చేస్తే టీడీపీలో చేరాలని అనుకుంటున్న కొణతాల రామకృష్ణ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories