ప్రధాని మోదీని కలిసిన మోహన్ బాబు కుటుంబం

ప్రధాని మోదీని కలిసిన మోహన్ బాబు కుటుంబం
x
Highlights

ప్రముఖ సినీనటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబు.. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబసభ్యులతో సహా ఢిల్లీ వెళ్లిన మోహన్ బాబు...

ప్రముఖ సినీనటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబు.. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబసభ్యులతో సహా ఢిల్లీ వెళ్లిన మోహన్ బాబు నేరుగా ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు ప్రధానితో మోహన్ బాబు సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా మోహన్ బాబు ను ప్రధాని మోదీ బీజేపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. చాలా రోజుల నుంచే ప్రధానితో మోహన్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

దాంతో గతంలోనే ఆయన బీజేపీలో చేరతారని అంతా భావించారు కానీ ఆయన చేరలేదు. మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడినా మోహన్ బాబుకు వైసీపీ ప్రభుత్వం ఏ పదవి ఇవ్వలేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ తో మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉంది. మోహన్ బాబు కోడలు విరోనికా స్వయానా జగన్ బాబాయ్ కుమార్తె.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories