రేపు వైసీపీలో చేరనున్న నటుడు అలీ

రేపు వైసీపీలో చేరనున్న నటుడు అలీ
x
Highlights

ప్రముఖ సినీ నటుడు అలీ.. సోమవారం వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. రేపు(సోమవారం) ఉదయం 11 గంటలకు అలీ.. జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనునట్టు...

ప్రముఖ సినీ నటుడు అలీ.. సోమవారం వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. రేపు(సోమవారం) ఉదయం 11 గంటలకు అలీ.. జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనునట్టు సమాచారం. గత ఏడాది డిసెంబర్ 28న ఎయిర్ పోర్టులో అలీ.. జగన్ ని కలిసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఆ రోజు నుంచి అలీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కాగా.. వాటిని ఇప్పుడు అలీ నిజం చేశారు. జగన్ ఆదేశిస్తే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమంటూ అలీ తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ఇదిలావుంటే టీడీపీ అధినేత చంద్రబాబు అలీని టీడీపీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories