పవన్ ఫోటో నా పర్సులో ఉంటది.. జగన్ నన్ను పిలవాలి..

పవన్ ఫోటో నా పర్సులో ఉంటది.. జగన్ నన్ను పిలవాలి..
x
Highlights

సినీనటుడు అలీ రాజకీయాల్లోకి రావడంపై తన మనసులో మాటను బయటపెట్టారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తాను...

సినీనటుడు అలీ రాజకీయాల్లోకి రావడంపై తన మనసులో మాటను బయటపెట్టారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తాను కానీ ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీలోనే చేరతానని స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర ముగింపు రోజు వైసీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. తాను వైసీపీలో చేరాలను కుంటే నేరుగా వారితో మాట్లాడి టికెట్ సంగతి తేల్చుకుని చేరతానని తెలిపారు. అలాగే నన్ను వైసీపీ అధినేత ఇంతవరకు పిలవలేదు. పిలిస్తే వెళ్లి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్ మీకు అత్యంత సన్నిహితుడు.. అలాంటప్పుడు జనసేనలో ఎందుకు చేరడంలేదు అని అడిగిన ప్రశ్నకు అలీ ఈ విధంగా సమాధానమిచ్చారు.. పవన్ కళ్యాణ్ కు నేనంటే చాలా ఇష్టం. అలాగే పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం. ఆయన ఫోటో నా పర్సులో ఉంటది. రాజకీయాలు వేరు సినిమాలు వేరు. జనసేన ఎవరిని నమ్ముకుని స్థాపించలేదు. ఆయన ఒక్కడే సైనికుడిలా పోరాడుతానని చెబితేనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారు.

ఇదిలావుంటే వైసీపీతో టచ్ లో ఉన్న అలీ గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్ టికెట్ అడుగుతున్నారు. కానీ గుంటూరు ఈస్టుకు ప్రస్తుతం ఆ పార్టీ తరపునే సిట్టింగ్ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఉన్నారు. అంతేకాకుండా గుంటూరు వెస్ట్ లో మాజీ పోలీస్ అధికారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు జగన్. ఈ క్రమంలో వీటిలో మార్పు ఉండదని అలికి చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన కర్నూల్, కడప, నంద్యాల లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరినట్టు అలీ మాటల్లోనే తెలుస్తోంది. అయితే వైసీపీ మాత్రం కర్నూల్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ తరువాత ముస్లిం నేతను కర్నూల్ ఇంచార్జ్ గా నియమించారు. ఈ సీటునే ఆలీకి ఇస్తే బావుంటుందనే ఆలోచన చేస్తోంది వైసీపీ. మరి అలీ దీనికి ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories