అలీ పోటీ చేసేది ఆ నియోజకవర్గం నుంచే..

అలీ పోటీ చేసేది ఆ నియోజకవర్గం నుంచే..
x
Highlights

టీడీపీ నుంచి సినీ నటుడు అలీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు గుంటూరు తూర్పు టికెట్టు ను చంద్రబాబు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అలీ పొలిటికల్...

టీడీపీ నుంచి సినీ నటుడు అలీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు గుంటూరు తూర్పు టికెట్టు ను చంద్రబాబు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అలీ పొలిటికల్ ఎంట్రీపై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..అలాగే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేఫథ్యంలో వరుసగా చంద్రబాబుతో భేటీ కావడం, చంద్రబాబు కూడా అలీ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కోరడంతో.. అలీ టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది.

ఒకప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేది. రెండు పర్యాయాలు ఎస్‌ఎం జియావుద్దీన్‌ గెలుపొందారు. అయితే 2004లో ఈ నియోజకవర్గంపై టీడీపీ పట్టు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన షేక్‌ సుభాని భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2014 లో వైయస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షేక్ మహమ్మద్ ముస్తఫా గెలుపొందారు. మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న గుంటూరు తూర్పుని ఈ దఫా ముస్లిం మైనార్టీ నేతకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు అలీ పేరుని పరిశీలిస్తున్నాయి. ఆలీకే టిక్కెట్ ఇవ్వడానికి చంద్రబాబునాయుడు కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అలికి టిక్కెట్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories