మదనపల్లి జంట హత్య కేసులో నిందితులు విశాఖ తరలింపు

Accused in Madanapalle Twin Murder Case Evacuated to Visakhapatnam
x

(file image)

Highlights

* పురుషోత్తంనాయుడు, పద్మజలకు వైజాగ్‌లో చికిత్స * వైజాగ్‌ కస్టోడియల్ కేర్‌లో వైద్యం * మదనపల్లె సబ్‌జైలు నుంచి వైజాగ్ తరలింపు

మదనపల్లి జంట హత్య కేసులో నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజలను విశాఖకు తరలించారు. మదనపల్లె సబ్‌ జైలు నుంచి వైజాగ్‌కు తీసుకెళ్లారు. తిరుపతి రుయా మానసిక వైద్య నిపుణుల సూచన మేరకు వైజాగ్ లో కస్టోడియల్ కేర్‌ ఉంచి వైద్యం అందించనున్నారు. గట్టి భద్రత నడుమ వైజాగ్‌కు తరలించారు.

మదనపల్లె సబ్‌ జైలులో ఉన్న పురుషోత్తంనాయుడు, పద్మజలు వింత చేష్టలతో తోటి ఖైదీలకు చుక్కలు చూపించారు. రాత్రి సమయంలో నిద్రపోకుండా పెద్దగా కేకలు వేశారని దాంతో ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారోనని ఖైదీ భయపడ్డారు. దాంతో మెరుగైన ట్రీమ్‌మెంట్ కోసం విశాఖలోని మానసిక చికిత్సా కేంద్రానికి పురుషోత్తం, పద్మజలను తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories