ప్రమాదాలకు నెలవుగా బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్

ప్రమాదాలకు నెలవుగా బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్
x
Highlights

బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చూడటానికి వచ్చామని ఫ్లై ఓవర్ పైనే ఆగిపోయేవారు ఎక్కువైపోయారు. రాత్రి వేళలు రేసింగ్ లతో రెచ్చిపోతున్నారు. ఫ్లై ఓవర్ పై కరువైన రక్షణపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్.

ఫ్లైఓవర్ నిడివి 2 కిలోమీటర్లు. ఇందిరాగాంధీ పార్కు నుంచీ భవానీపురం లారీ స్టాండుకు చేరుకోవడానికి సుమారు పది నిముషాలు పాడుతుంది. ఈ మధ్యలో మూడు మలుపులు ఉంటాయి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే పట్టించుకునే నాధుడుండడు‌.

ఈమధ్యనే ఫ్లైఓవర్ పై ఓ ఎక్సిడెంట్ జరిగింది. రాత్రివేళ ఒక బైకు మీద యువతితో కలిపి ముగ్గురు, మరో బైకు మీద ఇద్దరు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. వారిలో కొందరికి బాగా దెబ్బలు తగిలాయి. గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటల్ కి వెళ్ళిపోయారు. విషయం చూస్తే ఫ్లైఓవర్ పై పార్టీ చేసుకుని వెళుతున్నారు. ఇక్కడ నిఘా నేత్రం లేకపోవడంతో వారి ఆటలు సాగాయి.

హైదరాబాదు వెళ్ళడానికి ఇన్నాళ్ళూ పడ్డ కష్టాలు తప్పాయి. కానీ అన్ని హంగులూ ఉన్న ఫ్లైఓవర్ పై రక్షణ లో భాగంగా పోలీసు పికెట్లు, సీసీ కెమెరాలు ఉంటే, ఏదైనా ప్రమాదం జరిగితే తెలుసుకునే వీలుంటుంది. తొమ్మిదేళ్ళుగా ఎదురు చూసిన విజయవాడ వాసులకు ఫ్లైఓవర్ ప్రారంభంతో కష్టాలు తీరాయి. కానీ ఏదైనా ముప్పు జరిగి, 100 కి డైల్ చేస్తే, వారు స్పందించినా... ప్రమాదానికి కారకులెవరో తెలిసేదెలా..?

ఇంద్రకీలాద్రికి పచ్చలహారంలా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్, ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసు పికెటింగ్ పెడతారని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories