చంద్రబాబుకు షాక్! అక్రమాస్తుల కేసులో విచారణకు ఏసీబీ కోర్టు నిర్ణయం!

చంద్రబాబు నాయుడు
x
చంద్రబాబు నాయుడు
Highlights

మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన అక్రమాస్తుల కేసులో విచారణకు కోర్టు నిర్ణయించింది.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాలని ఆరోపిస్తూ 2005లో లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. అప్పట్లో ఈ కేసు విషయంలో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ స్టే పై ఎటువంటి పోదిగింపూ లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి సోమవారం ఉత్త్తర్వులు జారీ చేశారు. లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని సూచిస్తూ కేసును ఈ నెల 25 వ తేదీకి వాయిదా వేశారు.

కేసు ఇదీ!

అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అక్రమాస్తులు కూడబెట్టారని, వాటిపై విచారణ జరిపించాలనీ లక్ష్మీపార్వతి ఆరోపిస్తూ.. ఈ విషయంలో ఏసీబీ విచారణ జరిపించాలని కోరుతూ ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే, చంద్రబాబు దీనిపై ఇంప్లీడ్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దాంతో హైకోర్టు కు వెళ్లిన చంద్రబాబు నాయుడుకు అక్కడ ఊరట లభించింది. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే విధించారు.

ఈ స్టే ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచీ ఈ కేసులో స్టే కొనసాగుతోంది. కాగా, గత సంవత్సరం సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో.. ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుందని వాదించారు. కానీ లక్ష్మీపార్వతి తరపు లాయర్ సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఊతంకిస్తూ వాదించారు. అదీ కాకుండా ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు కూడా లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో, 2005లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించిన న్యాయమూర్తి, 2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, సుప్రీంకోర్టు తీర్పుతో 2005లో విధించిన స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి క్లారిటీ లేదని చెబుతూ విచారణకు ఆదేశాలు జారీచేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories