ఏపీలో అవినీతిపరుల తాట తీస్తున్న ఏసీబీ.. జిల్లాల వారీగా అక్రమ నగదును స్వాధీనం

ఏపీలో అవినీతిపరుల తాట తీస్తున్న ఏసీబీ.. జిల్లాల వారీగా అక్రమ నగదును స్వాధీనం
x
Highlights

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల్లో అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సోదాల్లో అనధికార...

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల్లో అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సోదాల్లో అనధికార డాక్యుమెంట్‌ రైటర్లను గుర్తించడం తోపాటు కార్యాలయాల్లో అక్రమ సొమ్ము రూ.10,34,256 మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల క్రయవిక్రయాలు చేసిన వారు రిజిస్ట్రేషన్‌ కోసం వస్తే డబ్బులు వసూళ్లు జరుగుతున్నట్టు ఈ సోదాల్లో తేలింది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద అనధికార డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేట్‌ వ్యక్తులను గుర్తించారు. అలాగే లెక్కల్లో చూపని అక్రమ సొమ్మును గుర్తించారు.

లంచాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరపనున్నట్లు ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు తెలిపారు. అవినీతి ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌ కు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అత్యధిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న ప్రభుత్వ శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తించారు. దాంతో రైడింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో 13 జిల్లాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. రూ.10,34,256 స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు జిల్లాల వారీగా దొరికిన అవినీతి సొమ్మును ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లా 'పలాస' - 1,08,050

విజయనగరం జిల్లా 'విజయనగరం' - 63,080

విశాఖపట్నం జిల్లా 'అనకాపల్లి' - 83,660

తూర్పుగోదావరి జిల్లా 'కాకినాడ' - 1,29,000

పశ్చిమగోదావరి జిల్లా 'కొవ్వూరు' - 84,410

కృష్ణా జిల్లా 'గుణదల' - 19,240

గుంటూరు జిల్లా 'తెనాలి' - 17,420

ప్రకాశం జిల్లా 'సింగరాయకొండ' - 13,540

నెల్లూరు జిల్లా 'బుచ్చిరెడ్డిపాలెం' - 40,110

చిత్తూరు జిల్లా 'మదనపల్లె' - 88,696

వైఎస్సార్‌ కడప జిల్లా 'రాయచోటి' - 80,010

కర్నూలు జిల్లా 'ఆదోని' - 91,220

అనంతపురం జిల్లా 'అనంతపురం రూరల్‌' - 2,15,820

మొత్తం - 10,34,256

Show Full Article
Print Article
More On
Next Story
More Stories