ఏపీలో సీనియర్ ఐపిఎస్ అధికారుల బదిలీ

ఏపీలో సీనియర్ ఐపిఎస్ అధికారుల బదిలీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అభయ్ త్రిపాఠిని ఢిల్లీలో...

ఆంధ్రప్రదేశ్‌లోని పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అభయ్ త్రిపాఠిని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా, 1996 బ్యాచ్ ఆఫీసర్ బావన సక్సేనాను రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. 2006 బ్యాచ్‌కు చెందిన అశోక్ కుమార్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. గతంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు సీఎం కార్యాలయానికి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్థానంలో బావన సక్సేనను నియమించారు.

కాగా ఢిల్లీలోని తిరుమల వెంకటేశ్వర ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో టిటిడి విజిలెన్స్ అధికారులను విచారణ కోసం ఢిల్లీ వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలోని ఆలయాన్ని పర్యవేక్షించే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ వేరొకరి విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అండర్ సెక్రటరీ స్థాయి అధికారి ఇప్పటికే దర్యాప్తులో ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో టీటీడీ వైఖరిని నిరసిస్తూ స్థానిక ఆలయం సలహా కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories