చంద్రబాబు కోసం కాన్వాయ్ వెంట మహిళ పరుగులు

A woman runs along the convoy for Chandrababu
x

చంద్రబాబు కోసం కాన్వాయ్ వెంట మహిళ పరుగులు

Highlights

కారులోంచి చూసి మహిళను పిలిచి మాట్లాడిన బాబు

బాబును చూడాలంటూ ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. సెక్యూరిటీ అడ్డుకున్నా... బాబుపై అభిమానంతో కాన్వాయ్‌ వెంట వెళ్లింది. కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న మహిళను చూసిన చంద్రబాబు... సెక్యూరిటీని వారించి ఆమెను పిలిచి వివరాలు తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని పరిచయం చేసుకుంది. మీపై అభిమానంతో జ్వరం ఉన్నా వచ్చానని... మీరు సీఎం కావాలనేదే తన కోరిక అని చెప్పారు. ముందు ఆస్పత్రికి వెళ్లాలంటూ నందినికి చంద్రబాబు సూచించి... ఆమెకు అవసరమైన వైద్యసాయం అందించాలంటూ పార్టీ కార్యకర్తలకు సూచించారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఉండవల్లికి చంద్రబాబు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories