Weather Updates: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. ఇవాళ, రేపు ఏపీకి వర్ష సూచన

A Surface Trough in the Bay of Bengal Rain Forecast for AP Today and Tomorrow
x

Weather Updates: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. ఇవాళ, రేపు ఏపీకి వర్ష సూచన

Highlights

Weather Updates: ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. రాయలసీమకు మోస్తరు వర్ష సూచన చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్టు స్పష్టం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories