Love Marriage: ఇండియన్ అబ్బాయిని పెళ్ళాడిన స్పెయిన్ అమ్మాయి

A Spain Girl Married to an Indian Boy
x

Love Marriage: ఇండియన్ అబ్బాయిని పెళ్ళాడిన స్పెయిన్ అమ్మాయి 

Highlights

Love Marriage: బెంగళూరులో డ్యాన్స్ మాస్టర్ గా పని చేస్తున్న స్పెయిన్ అమ్మాయి

Love Marriage: దేశాలు వేరు.. సాంప్రదాయాలు వేరు.. వాళ్లిద్దరి పరిచయాలు... ప్రేమగా మారాయి. ప్రేమ ఫలించింది.. పెళ్లి పీటలెక్కింది. మూడు ముడుల బంధంతో వైవాహిక జీవితాన్ని సొంతం చేసుకున్నారు. స్పెయిన్‌కు చెందిన యువతి, తిరుపతికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ ఇష్టపడి పెద్దలను ఒప్పించి.. హిందూ సాంప్రదాయంప్రకారం పెళ్లి చేసుకుంది.

తిరుపతికి చెందిన యుగేష్ అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే రోజూ ఆఫీస్ కి వెళ్తూ వచ్చే సమయంలో తన కంపెనీకి సమీపంలో ఓ స్కూల్లో స్పెయిన్ దేశానికి చెందిన లూరా రోషియా స్పానిష్ టీచర్‌గా పని చేస్తోంది.. స్పెయిన్ అమ్మాయిని చూసిన యుగేష్ ప్రేమలో పడ్డాడు.. దీంతో ఇరువురు తమ ప్రేమకు కలకాలం నిలుపు కోవాలని, జీవితాంతం ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు.. యుగేష్ తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించి చివరికి పెళ్ళికి ఒప్పించాడు.. దీంతో యుగేష్ రోషియాతో వారి తల్లిదండ్రులకు తెలియజేయడమే కాకుండా యుగేష్ తన స్వయంగా రోషియా తల్లిదండ్రులకు మాట్లాడి పెళ్ళికి ఒప్పించాడు.. దీంతో వీరు ఇద్దరూ యుగేష్ తల్లిదండ్రుల కోరిక మేరకూ హిందూ సాంప్రదాయం ప్రకారం చిత్తూరు జిల్లా అరగొండ ఆంజనేయ స్వామి వారి ఆలయం సమీపంలో గౌరీశంకర్ కళ్యాణ మండపంలో వివాహం జరిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories