మంత్రి బంధువునంటూ మోసాలు.. పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు

మంత్రి బంధువునంటూ మోసాలు.. పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు
x
వంశీకృష్ణ రెడ్డి
Highlights

ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడు ప్రముఖులతో పరిచయాలు చేసుకున్నాడు. ఫొటోలు దిగాడు. మంత్రి బంధువునంటూ వసూళ్లకు తెగబడ్డాడు. అడ్డువచ్చిన వారిని హతమార్చాడు....

ఈజీగా మనీ సంపాదించాలనుకున్నాడు ప్రముఖులతో పరిచయాలు చేసుకున్నాడు. ఫొటోలు దిగాడు. మంత్రి బంధువునంటూ వసూళ్లకు తెగబడ్డాడు. అడ్డువచ్చిన వారిని హతమార్చాడు. మంత్రి పీఏ ఫిర్యాదుతో పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేశారు.

అతనో ఓ యువనాయకుడుగా చెలామణి అవుతున్నాడు. అందునా మంత్రి గౌతమ్‌ రెడ్డికి బంధువునంటూ ప్రచారం చేసుకున్నాడు. ఎక్స్‌పోజర్‌ కోసం కొత్త ఎత్తులు వేశాడు. మంత్రితో ఫోటోలు దిగాడు. ఆపై మంత్రి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజులంటూ కొన్ని సేవా కార్యక్రమాలు చేసి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాడు. ఆ పై అసలు రూపం బయటపెట్టాడు.

సీన్ కట్ చేస్తే మంత్రి బంధువునంటూ అడ్డగోలుగా వసూలుకు దిగాడు. నెల్లూరు, విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌ సహా మంత్రి అనుచరులు ఎంతవరకు ఉన్నారో అంత స్థాయిలో భారీగా మోసాలు చేశాడు. పెద్ద ఎత్తున నగదు వసూళ్లకు పాల్పడ్డాడు. గుట్టు చప్పుడు కాకుండా మంత్రి బంధువునంటూ చేస్తున్న ఆ ఖతర్నాకు అక్రమాల వివరాలు తెల్సుకున్న మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ రెడ్డి నెల్లూరు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు వంశీకృష్ణ రెడ్డి ని అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారించారు. ఇంకేముంది పోలీసులకు బైర్లు కమ్మే నేరచరిత్ర వెలుగు చూసింది అడ్డగోలు దందాను అడ్డుకుని ఆ పై అరెస్ట్‌ చేశారు.

వంశీకృష్ణ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలం ఈదూరు. వ్యాపార నిమిత్తం నెల్లూరు వచ్చిన గుండాల వంశీకృష్ణ రెడ్డి నగరంలోని వనంతోపు సెంటర్లో మకాం వేసి చిన్నచిన్న వ్యాపారాలు చేసి నష్టపోయాడు. ఆపై అడ్డగోలుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదార్లు తొక్కాడు అందుకు ప్రముఖుల పరిచయాలు వారితో సాన్నిహిత్యంగా ఉంటూ బిల్డఅప్ లు ఇస్తూ యధేచ్చగా వసూళ్లకు తెగబడ్డాడు.

ఈక్రమంలోనే మంత్రి గౌతమ్ రెడ్డిని లక్ష్యంగా తాను మంత్రి కి బంధువునంటూ నమ్మబలికాడు ఆపై నేరాలు కొనసాగించాడు. అందులో అడ్డు వచ్చిన వారిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఢిల్లీకి చెందిన ఓ యువతిని మాయలో పెట్టి హైదరాబాద్ లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కేసులో చంచలగూడ జైలు కెళ్లి అక్కడ మరో నేరస్థుడితో కలిసి మరిన్ని అక్రమాలకు తెగపడ్డాడు. ఆర్థిక వ్యవహారాల్లో అడ్డువచ్చిన వారిని హతమారుస్తూ ఆర్థిక, హత్యానేరాలకు పాల్పడుతున్న ఇతని వివరాలు మంత్రి పి ఏ మనోహర్ రెడ్డి పోలీసులకిచ్చిన సమాచారం తో ఇతని నేరాల గుట్టు రట్టయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories