తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆదర్శ వధూవరులు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆదర్శ వధూవరులు
x
Highlights

* రక్తదానమే బహుమానంగా భావించిన జంట * కల్యాణ వేదిక వద్దే రక్తదాన శిబిరం ఏర్పాటు * 50 మందికి పైగా రక్తదానం * అతిథులు, యువతకు ఆదర్శంగా నిలిచిన వధూవరులు

జనరల్‌గా మనం పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు వధూవరులకు ఇచ్చేందుకు గిఫ్ట్ లేదా బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్తాం. కానీ.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మాత్రం నూతన వధూవరులు అనూహ్యంగా ఆలోచించారు. తమ పెళ్లికి వచ్చేవారు గిఫ్ట్‌లు తీసుకురాకపోయినా పర్వాలేదు. జస్ట్‌ రక్తదానం చేసి.. నలుగురికి ప్రాణదానం చేస్తే చాలు అని భావించారు. అదే తమకు నిజమైన ఆశీస్సులు అని భావించారు. ఇదే విషయాన్ని తమ పెళ్లిపత్రికల్లో కూడా ముద్రించి ఎందరిలోనో స్ఫూర్తిని నింపారు.

దయాసాగర్‌, కృష్ణవేణిల వివాహం ఆదివారం నాడు పిఠాపురంలో జరిగింది. ఈ సందర్భంగా వివాహానికి వచ్చే అతిథులు, యువత, రక్తదానం చేయాలని సూచించారు. దానికోసం పెళ్లివేదిక దగ్గరే రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తొలుత రక్తదాన శిబిరాన్ని నూతన వధూవరులు ప్రారంభించగా.. అనంతరం పెళ్లికి విచ్చేసిన అతిథులు, యువతతో పాటు చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రక్తదానం చేశారు. ఈ విధంగా తమ వివాహంలోనే ఆదర్శాన్ని ఎంచుకున్నారు దంపతులు.

తన వివాహం వేదికగా ఒక మంచి పని జరగాలనే ఉద్దేశంతోనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశానని వరుడు దయాసాగర్‌ తెలిపాడు. ఈ కార్యక్రమంపై ఇంట్లో చెప్పినప్పుడు తల్లిదండ్రులు, బంధువులు ఒకింత షాక్‌కు గురయ్యారని.. కానీ.. మంచి పని కావడంతో అందరూ అంగీకరించారని చెప్పారు. అందరి సహకారంతోనే రక్తదాన కార్యక్రమం విజయవంతం అయ్యిందని అన్నారు దయాసాగర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories