సెలెక్ట్ కమిటీలో కొత్త కోణం

సెలెక్ట్ కమిటీలో కొత్త కోణం
x
సెలెక్ట్ కమిటీలో కొత్త కోణం
Highlights

సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఎప్పుడు...? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే టాపిక్ మండలి చైర్మన్ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు....

సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఎప్పుడు...? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే టాపిక్ మండలి చైర్మన్ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు. తరువాత ఏం జరిగింది...? ఏం జరుగుతుంది...? సెలెక్ట్ కమిటీ వేశారా...? లేదా...? రాజకీయాలను అబ్జర్వ్ చేసే ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే.

సెలెక్ట్ కమిటీలో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఇప్పటి వరకు సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి సభ్యుల పేర్లు ఇవ్వాల్సిందిగా పార్టీలకు ఎలాంటి లేఖలు చేరలేదు ఇక, సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదంటున్నాయి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్గాలు. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని మూడు రోజుల క్రితమే శాసన మండలి చైర్మన్ ప్రకటించారు అయితే, ఇప్పటి వరకు సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన లేఖలు రాయకపోవడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది.

ఇక, వికేంద్రీకరణ బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకోగా బిల్లులు అసలు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదనే వాదననే వినిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే, అంతా నిబంధనల ప్రకారమే చేశామని టీడీపీ నేతలు చెబుతున్నారు. జనవరి 26న సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలని చైర్మన్ నుంచి లేఖలు వచ్చాయని టీడీఎల్పీ సమావేశంలో కొంత మంది టీడీపీ నేతలు చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి లేఖలు అందలేదని ఇప్పుడు అంటున్నారు వైసీపీ నేతలు కూడా తమకు ఎటువంటి లేఖలు అందలేదంటున్నారు.

సెలెక్ట్ కమిటీకి రెండు బిల్స్ వెళ్లటంతోనే మండలి రద్దు చేశారు అలాంటిది, ఆసలు సెలెక్ట్ కమిటీ ప్రక్రియ ఎక్కడివరకు వచ్చిందో, ఎవరు కరెక్టు గా చెప్పలేకపోతున్నారు మరి, సెలెక్ట్ కమిటీకి ఏర్పాటుకు ఎప్పుడు ముందడుగు పడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories