మిస్సింగ్ కేసును ఛేదించిన వాట్సాప్‌, ఫేస్ బుక్

మిస్సింగ్ కేసును ఛేదించిన వాట్సాప్‌, ఫేస్ బుక్
x
Highlights

వాట్సాప్‌, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా కేవలం ఫ్రెండ్స్ ఛాటింగ్ చేసుకోడం, కబుర్లు చెప్పుకోవడం మాత్రమే కాదు. ఈ యాప్ ల ద్వారా కొన్ని మంచి పనులు...

వాట్సాప్‌, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా కేవలం ఫ్రెండ్స్ ఛాటింగ్ చేసుకోడం, కబుర్లు చెప్పుకోవడం మాత్రమే కాదు. ఈ యాప్ ల ద్వారా కొన్ని మంచి పనులు కూడా చేయగలరని ఈ సంఘటన నిరూపించింది. ఊహతెలియని రెండున్నరేళ్ల చిన్నారి తప్పిపోయింది. అయితే ఈ సోషల్ మీడియా ఈ చిన్నారిని తన తల్లదండ్రుల వద్దకు చేర్చింది.

ఈ సంఘటన అనంతపురం జిల్లలో చోటు చేసుకుంది. సురేష్‌బాబు కుటుంబం అనంతపురం రూరల్‌ సమీపంలోని కొడిమి క్రాస్‌ సెంటర్‌లో నివసిస్తున్నారు. ఇతను ఆటో నడిపించుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని రెండున్నరేళ్ల తేజేశ్వర్‌ అనే కొడుకున్నాడు. అయితే రోజూ లాగానే ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు చుట్టుపక్కన ఉన్న ప్రాంతాన్నంతా గాలించారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో బాలుని తల్లదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల వద్ద ముమ్మర గాలింపు చర్యలు జరిపారు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలు తెప్పించి బాలుడి 'ఇంటి చుట్టు పక్కల సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వెతికించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేక పోవడంతోవాట్సాప్‌, ఫేస్ బుక్ లద్వారా అన్ని గ్రూపుల్లో బాలుడి సంబంధించిన వివరాలను, ఫోటోను షేర్ చేశారు. దీంతో బాలుడి ఆచూకీ పోలీసులకు ఫోన్ ద్వారా తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వీర రాఘవ రెడ్డి వివరించారు. కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి కొడిమి సమీపంలో రాత్రి 8.20 గంటల సమయంలో బాలుడు ఏడుస్తూ కనిపించాడని, తనకు పెళ్లై తొమ్మిదేళ్లు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఆ పిల్లవాడిని పెంచుకుందామని అనుకున్నాడని తెలిపారు. బాలుడు ఏడుస్తూ రోడ్డుపై ఒంటరిగా ఉండడంతో బాలుడిని తన ఇంటికి తీసుకెళ్లాడని తెలిపారు. అనంతరం వాట్సాప్, ఫేస్ బుక్ ల ద్వారా బాలుడి ఫోటో ప్రచారం కావడంతో ఆ చిన్నారి తనవద్దే ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించి, నవంబర్‌ 16న బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories