ప్రేమోన్మాదికి అనంతపురం జిల్లాలో మరో అమ్మాయి బలి

ప్రేమోన్మాదికి అనంతపురం జిల్లాలో మరో అమ్మాయి బలి
x
Highlights

* అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత దారుణహత్య * రాజేష్, కార్తీక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు * కేసు దిశ పోలీస్ స్టేషన్‌కు అప్పగింత * నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధితురాలి తల్లి డిమాండ్

ఏపీలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. నెలకో చేదు వార్త వినాల్సిన దౌర్భాగ్య స్థితి దాపరించింది. మొన్న విజయవాడ, నిన్న వైజాగ్, ఇప్పుడు అనంతపురం జిల్లా. ఇలా ప్రతినిత్యం అమ్మాయిల ఉసురు తీసుకుంటున్నారు కిరాతకులు. ప్రేమిస్తే.. పరువు హత్యలు.. ప్రేమించకుంటే.. ప్రేమోన్మాదం.. దేశాన్ని భారతమాతగా భావించే ఈ గడ్డపై అమ్మాయిలకు భద్రత కరువేనా.. స్త్రీని దేవతగా కొలుస్తామని చెప్పే ఈ దేశంలో మహిళలకు రక్షణ లేనట్టేనా..

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో మరో యువతి ప్రేమోన్మాదికి బలైంది. ప్రేమించని పాపానికి స్నేహలత అనే అమ్మాయిని గొంతు నులిమి చంపేశారు ఇద్దరు కిరాతకులు. పదిరోజుల కిందటే ఉద్యోగం చేరిన ఆనందమైనా తీరకముందే స్నేహలతను కడతేర్చారు. అనవాళ్లు కనిపించకుండా ఆమె పొట్టపై కాగితాలు వేసి నిప్పంటించారు.

స్నేహలత హత్య కేసులో నిందితులు రాజేశ్, కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు పోలీసులు. ఇద్దరిపై రౌడీషీట్‌ ఓపెన్ చేశారు. అలాగే 302, అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

తన కూతురిని రాజేష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని స్నేహలత తల్లి లక్ష్మిదేవి డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బాధిత కుటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. వారికి ధైర్యంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories