Avinash Reddy: ఇవాళ సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ

A Hearing on MP Avinash Reddy Anticipatory Bail will be Held in the Supreme Court Today
x

Avinash Reddy: ఇవాళ సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ

Highlights

Avinash Reddy: అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి పిటిషన్

Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీతరెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హాసనుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివేకా హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

గత శుక్రవారం 9న సుప్రీంకోర్టులో న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ.. వివేకా కేసులో దర్యాప్తు కోసం రావాలని సీబీఐ కోరుతున్నా.. అవినాష్‌రెడ్డి హాజరు కాలేదంటూ కోర్టుకు తెలిపారు. అవినాష్ రెడ్డి దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ ధర్మాసనానికి వినిపించారు. దీనిపై స్పందించిన బెంచ్‌.. పిటిషన్‌పై నేడు విచారణ జరుపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories