గుంటూరులో సంచలనం : నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న టీచర్

గుంటూరులో సంచలనం : నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న టీచర్
x
Highlights

పేరుకు అతను టీచర్.. మంచి మాటలు చెప్పి విద్యార్దులను సక్రమార్గంలో పెట్టాల్సింది పోయి తానే దారి తప్పాడు. పెళ్లిళ్ల మోజులో పడి

పేరుకు అతను టీచర్.. మంచి మాటలు చెప్పి విద్యార్దులను సక్రమార్గంలో పెట్టాల్సింది పోయి తానే దారి తప్పాడు. పెళ్లిళ్ల మోజులో పడి నలుగురు మహిళలను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో అతని రెండో భార్య స్పందించి పోలీసులకి చెప్పడంతో ఈ నిత్యపెళ్లి కొడుకు అసలు విషయాలు బయటకు వచ్చాయి.

మహమ్మద్‌ బాజీ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. తోట్లవల్లూరు సమీపంలోని సౌత్‌ వల్లూరులోని మండల పరిషత్‌ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పని చేస్తున్నాడు.అప్పటికి అతనికి పేలు అయినప్పటికీ తెనాలికి చెందినా యువతీకి తన మొదటి భార్య చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వేరే కాపురం పెట్టి ప్రతి ఆదివారం వచ్చి వెళుతుండేవాడు. భర్తపైన అనుమానం వచ్చిన ఆమెకి మరో మహిళను వివాహం చేసుకున్న విషయం తెలిసింది.

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మరో యువతిని మహమ్మద్‌ బాజీ మూడో వివాహం చేసుకున్నాడు. దీనిపైన అతనిని రెండో భార్య నిలదీయగా ఆమెను తిట్టి కొట్టడంతో గర్భస్రావం కావడంతో ఆస్పత్రిలో వదిలేసి వెళ్లాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా పద్దతి మార్చుకుంటానని చెప్పాడు. ఇక ఇదే అనుమానం మూడో భార్యకు తెలియడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. రెండో భార్యకు విడాకులు ఇస్తేనే కాపురానికి వస్తానని ఆమె పట్టుబట్టింది.

మూడు పెళ్ళిళ్ళతో ఆగకుండా దుగ్గిరాలకు చెందిన 15 ఏళ్ళ బాలికను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.ఆమెకి ఉంగరం, రూ.30 వేలు ఇచ్చి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలికను కూడా వదిలేసి మళ్ళీ రెండో భార్య దగ్గరకి వచ్చాడు, మరో పెళ్లి చేసుకోమని అవసరమైతే విజయవాడలోని వాంబే కాలనీలో ఇల్లు కొన్నానని, నకిలీ డాక్యుమెంట్లు చూపించి మోసం చేయాలనీ అనుకున్నాడు. కానీ ఆ డాక్యుమెంట్లను పరిశీలిస్తే అవి నకిలీవని తేలడంతో ఆమె స్పందన కార్యక్రమంలో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు తమదైన స్టైల్ లో కోటింగ్ ఇవ్వడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతని మొదటి భార్య బతికే ఉండగా, అతడి వేధింపులు భరించలేక పదేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories