పోలవరం ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లిన బోటు బోల్తా

A fishing boat overturned in the Polavaram project
x

పోలవరం ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లిన బోటు బోల్తా

Highlights

* ఐదుగురు గల్లంతు, ముగ్గురిని కాపాడిన మత్స్యకారులు... గల్లంతయిన వారిలో దొరకని ఇద్దరి ఆచూకీ

Eluru: ఏలూరు జిల్లాలో ఉపాధి కోసం చేపల వేటకు వెళ్లిన యువకులు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లిన ఐదుగురు యువకులు స్పిల్ వే పరిసరాల్లో వెళ్లే సమయంలో నీటి ఉధృతికి పడవ తిరగబడింది. పడవ బోల్తా పడిన విషయాన్న గమనించిన సమీప దూరంలో ఉన్న వాళ్లు ముగ్గురిని కాపాడారు. గల్లంతయిన వారిలో ఇద్దరు ఆచూకీ దొరకలేదు. గల్లంతైన వారిని సూరిమిల్లి కృష్ణమూర్తి, వాటాల అప్పల స్వామిగా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన వారిని చికిత్సకోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలవరం పరిసరాల్లో ఉన్న వారు వేర్వేరుగా 20 బోట్లల్లో చేపల వేటకు వెళ్లడంతో ఒక బోటు నీటి ఉధృతికి తిరగబడిందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories