గుంటూరు చేపల మార్కెట్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు చేపల మార్కెట్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం
x
Highlights

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్పొరేషన్ సమీపంలోని చేపల మార్కెట్ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో మొబైల్ షాప్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్పొరేషన్ సమీపంలోని చేపల మార్కెట్ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో మొబైల్ షాప్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మరోవైపు సెల్ ఫోన్ షాపులోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక మరేమయినా కారణాలున్నాయా అన్నదానిపై విచారణ చేపట్టారు. సెల్ ఫోన్ షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించాయి. అయితే గతంలో ఈ కాంప్లెక్స్‌లో చేపల మార్కెట్ ఉండేది. కరోనా లక్‎డౌన్ కారణంగా చేపల మార్కెట్‌ను అక్కడి నుంచి ఖాళీ చేసి నగర శివారుకు తరలించారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories