Robbery: శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి ఇంట్లో చోరీకి విఫలయత్నం..!

* ఇంట్లో విలువైన వస్తువులేమీ లేకపోవడంతో వెనుదిరిగిన దొంగలు

R Tripura Malini
Published on: 9 Nov 2022 10:52 AM IST
a failed attempt to steal from the house of an employee of srisailam devasthanam
X

శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి ఇంట్లో చోరీకి విఫలయత్నం

Robbery: శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి ఇంట్లో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు దొంగలు. MIG-96లోని ఎలక్ట్రిషన్‌ ఏఈ సుబ్బారెడ్డి ఇంట్లో చోరీకి కొందరు దుండగులు ప్రయత్నించారు. ఇంటి తలుపులు, ఇనుప బీరువాలను పగుటకొట్టారు. అయితే ఇటీవలే శ్రీశైలం నుంచి శ్రీకాళహస్తికి బదిలీ అయ్యారు సుబ్బారెడ్డి. విలువైన వస్తువుల, సామగ్రి తమ వెంట తీసుకెళ్లడంతో దొంగలు వెనుదిరిగారు. ఇంట్లో ఎవరూలేరన్న పక్కా సమాచారంతోనే దొంగతనానికి యత్నించారని సుబ్బారెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story