నరసరావుపేట టూటౌన్ సీఐ తీరుపై ఐజీకి ఓ కుటుంబం ఫిర్యాదు

X
Representational Image
Highlights
* అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో సీఐ జోక్యం * అన్న నాగ మురళీతో సీఐ కృష్ణయ్య కుమ్మక్కయ్యారని ఆరోపణ
Sandeep Eggoju6 Feb 2021 6:00 AM GMT
గుంటూరు జిల్లా నరసరావుపేట టూ టౌన్ సీఐ కృష్ణయ్యపై ఐజీకి ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో సీఐ జోక్యం చేసుకున్నారు. బ్యాంక్‌లో ఐదు కోట్ల ఫిక్సడ్ డిపాజిట్ నగదును అన్న నాగ మురళీ మాయం చేశాడు. అన్నపై ఆధారాలతో సహా బ్యాంక్ అధికారులకు తమ్ముడు నాగార్జున ఫిర్యాదు చేశాడు. అన్న నాగ మురళీతో సీఐ కృష్ణయ్య కుమ్మక్కై తనను హతమార్చే ప్రయత్నం చేస్తున్నాడని తమ్ముడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్టేషన్‌లో బంధించి డాక్యుమెంట్‌లపై సంతకాలు చేయాలని బెదిరించారని నాగార్జున వాపోయాడు. సీఐ కృష్ణయ్య నుంచి తమను కాపాడాలని నాగార్జున దంపతులు కోరుతున్నారు. అధికారులు న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బాధితులు వెల్లడించారు.
Web TitleA Complaint Raised on CI by a Family in Narasaraopet
Next Story