గర్ల్స్ హాస్టల్ లోకి దూరిన యువకుడు.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం

గర్ల్స్ హాస్టల్ లోకి దూరిన యువకుడు.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం
x
Highlights

పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అమ్మాయిల హాస్టల్‌ గదిలోకి ఓ యువకుడు దూరి దాదాపుగా అక్కడే 12...

పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అమ్మాయిల హాస్టల్‌ గదిలోకి ఓ యువకుడు దూరి దాదాపుగా అక్కడే 12 గంటల పాటు ఉన్నాడు. గది కిటికీ ఊచలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించాడు అ యువకుడు. కళాశాలలో ఈ నెల 14 నుంచి 16 వ తేదీ వరకు టెక్ ఫెస్ట్ నిర్వహించారు. అందరూ ఆ హాడావుడిలో ఉండగా, అదే కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ఓ యువకుడు 16 వ తేదీన అర్ధరాత్రి 12 గంటల సమయంలో చొరబడ్డాడు.

అయితే గదిలో ఉన్న మిగతా నలుగురు అమ్మాయిలు బయటకు వెళ్లి రూమ్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. అలా బయటకు వెళ్లిన అమ్మాయిల్లో ఒకరు ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలపడంతో వారు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా మంచం కింద యువకుడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువకుడు హాస్టల్లోకి ప్రవేశించేందుకు విద్యార్థినుల ప్రమేయం ఉందని నిర్ధారించిన యాజమాన్యం ఆరుగురిని సస్పెండ్ చేసింది.

ఏటా లక్షలు ఖర్చు పోసి హాస్టళ్లు నిర్వహిస్తున్న అధికారులు భద్రతను గాల్లోకి వదిలిపెట్టిందనే ఆరోపణలు నిజమవుతున్నాయి. అమ్మాయిల గదిలో ఓ అబ్బాయి ఏకంగా అన్ని గంటల పాటు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. హాస్టల్లో ఉంటే తమ పిల్లలు భద్రంగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తారు. ఎలాంటి పరిస్థితి వచ్చిన వార్డెన్లు ఉన్నారనే భరోసా ఉంటుంది. కానీ ఇలాంటి ఘటన వెలుగుచూడటం విద్యార్థుల పేరెంట్స్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మిగతా విద్యార్థినులు కానీ వారి పేరెంట్స్‌ కానీ.. హాస్టల్ భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విషయం బయటకు పొక్కడంతో ట్రిపుల్ ఐటీ అధికారులు తీవ్రంగా స్పందించారు..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories